Monday, 29 May 2023

IPL 2023 Final: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్‌టైన్‌ చేసి తీరుతాం'

 అయితే ఇవాళ కూడా మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ వర్షం లేకపోవడంతో టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది.



కాగా టాస్‌ అనంతరం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''వర్షం పడే సూచనలు ఉండడంతో ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక క్రికెటర్‌గా మంచి ఆట ఆడాలని అనుకుంటాం. నిన్న(ఆదివారం) జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ల భాగంగా మేం మొత్తం డ్రెస్సింగ్‌ రూంకే పరిమితమయ్యాం. అయితే మాకంటే ఎక్కువగా బాధపడింది అభిమానులు.

నిన్నటి మ్యాచ్‌ కోసం రాత్రంతా ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇవాళ వాళ్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలుగుతుందని చిన్న నమ్మకం. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఐదు ఓవర్లు మ్యాచ్‌ ఆడే అవకాశాలుంటాయనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఇవాళ 20 ఓవర్ల కోటా గేమ్‌ జరిగేలా ఉంది. అలా జరిగితేనే టోర్నీకి సరైన ముగింపు ఉంటుంది. ఇక క్వాలిఫయర్‌-1 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అంటూ తెలిపాడు.

No comments:

Post a Comment