Sunday, 22 August 2021

ఉచితంగానే రూ.5 లక్షలు అందిస్తున్న కేంద్రం.. ఇలా చేస్తే చాలు.. అప్లై చేసుకోవడానికి ఒక్క రోజే గడువు!

 

మీరు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.15 లక్షలు పొందాలని భావిస్తున్నారా? అయితే మీరు ఒక పని చేయాలి. లోగో, ట్యాగ్‌లైన్, పేరు వంటివి సూచిస్తే సరిపోతుంది. మీరే విజేత అయితే మీకు ఈ డబ్బులు లభిస్తాయి



కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది. మీరు ఉచితంగానే రూ.15 లక్షలు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు మోదీ సర్కార్ తీపికబురు అందించింది. మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే.. ఉచితంగానే రూ.5 లక్షలు పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కోసం డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ DFI ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి పేరు, లోగో, ట్యాగ్‌లైన్ వంటివి కావాలి. దీని కోసం కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ కాంటెస్ట్‌కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒక్కో కేటగిరిలో ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తారు.తొలి ప్రైజ్ కింద రూ.5 లక్షలు అందిస్తారు. అలాగే రెండో ప్రైజ్ కింద రూ.3 లక్షలు, మూడో ప్రైజ్ కింద రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఇలా ఒక్కో కేటగిరికి చెల్లిస్తారు. అంటే పేరు, ట్యాగ్‌లైన్, లోగో.. ఇలా మూడు కేటగిరిల్లో ప్రైజ్ మనీ అందిస్తారు. మూడే కేటగిరిల్లో మీరే విజేత అయితే రూ.15 లక్షలు వస్తాయి. ఏదో ఒక్క కేటగిరిలో విజేతగా నిలిస్తే రూ.5 లక్షల వరకు పొందొచ్చు. ఆగస్ట్ 15 లోపు అప్లై చేసుకోవలసి ఉంటుంది. https://auth.mygov.in/user/login?destination=oauth2/authorize ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment