Friday, 6 March 2020

corona two positive cases in Telangana.!

తెలంగాణాలో మరో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాళ్ళు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు…? లేదా వాళ్ళకు ఎవరి నుంచి అయినా సోకిందా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అప్రమత్తమైన అధికారులు వారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణా ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు.

No comments:

Post a Comment